భీమవరంలో, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) పనితీరు, మహిళా సాధికారత, నిధులు, విధులు, సమావేశాలు, ఆడిట్ లపై సమగ్ర సమీక్ష నిర్వహించి, డ్వాక్రా రుణాలను తక్కువ వడ్డీలకు ఆప్కాబ్ ద్వారా నేరుగా అందించాలని, డ్వాక్రా ఉత్పత్తులకు డీసీఎంఎస్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందించారు.