ప్రభుత్వాసుపత్రి రోగుల సహాయార్థం సపోర్ట్ స్టాండ్స్ అందజేత

భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో ఉన్న పేషెంట్లకు సౌకర్యార్థం సపోర్ట్ స్టాండ్స్ ఎంతో అవసరమని భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ది కమిటి డైరెక్టర్ సుంకర దాసు అన్నారు. పట్టణానికి చెందిన ఆకుల రాజా పుట్టినరోజు సందర్భంగా గురువారం దాసు సహకారంతో 2 సపోర్ట్ స్టాండ్స్ ను అందించారు. దాసు మాట్లాడుతూ బాధితులు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉండటం వాళ్లకి ఏదైనా ఒక సహాయం చేయాలనీ సపోర్ట్ స్టాండ్లు ఆ రోగులకు అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕