పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి వేడుకల్లో భాగంగా శనివారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కొనిశెట్టి రామలింగేశ్వరరావు, కొనిశెట్టి రాము, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన ప్రారంభమైంది. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ యర్రంశెట్టి శివకృష్ణ అన్నారు.