తల్లి మృతితో అనాథలైన నలుగురు పిల్లలకు అండగా విజ్ఞాన వేదిక

భీమవరం ఇందిరమ్మ కాలనీ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న మేరీ అనే మహిళ మృతి చెందడంతో ఆమె మీద ఆధారపడిన 4 పిల్లలు అనాధలుగా మిగిలారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం పళ్ళ శేషలీల, రామం దంపతుల సహకారంతో బస్తా బియ్యం, నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ వర్మ, చాన్ భాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్