జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన అంగన్వాడి టీచర్ వేదకుమారి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లింగరాజు వేద కుమారిని పరామర్శించారు.