కామవరపుకోట మండలం ఆడమిల్లి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో చరిత్ర, కామర్స్ సబ్జెక్టుల నందు గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు బుధవారం తెలిపారు. ఆయా సబ్జెక్టుల నందు పీజీ 55% ఉత్తీర్ణత కలిగి ఉన్న, అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, తరువాత మౌఖిక పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.