చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన మహిళ గురువారం ఎర్రగుంటపల్లి గ్రామ శివారు దుర్గమ్మ గుడికి వెళ్లి వస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి మహిళకు లిఫ్ట్ ఇస్తానని ఆమెను బైక్‌పై ఎక్కించుకొని ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను కొట్టి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ తెలిపింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఏలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.