ద్వారకాతిరుమల మండలంలోని వివాదాస్పద భూమి అంశంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఊహాగానాలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.