చింతలపూడిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో గోపి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 2 లీటర్ల సారాను సీజ్ చేశారు. అదే గ్రామానికి చెందిన దివ్య అనే మహిళకు సంబంధించిన 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, పరారీ కేసు నమోదు చేశామని సీఐ అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్