చింతలపూడిలో అగ్ని ప్రమాదం

చింతలపూడి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న జ్యూస్ పాయింట్‌లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో దుకాణం పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్