టి. నరసాపురం మండలంలోని తెడ్లెం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీమ్ (38) అనే యువకుడు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందాడు. అతను అదే గ్రామంలో అసిస్టెంట్ లైన్ మెన్ వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది. స్థానికులు అతన్ని చింతలపూడి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.