కామవరపుకోట మండలం ఉప్పలపాడు పంచాయతీ నారాయణపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 25న కుటుంబ సభ్యులతో కలిసి ధర్మాజీగూడెం వెళ్లిన బాధితులు 27న తిరిగి వచ్చి చూడగా, గేటు, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి బీరువాలోని 6 కాసుల బంగారు ఆభరణాలు, 25 గ్రాముల వెండి, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.