మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం జంగారెడ్డిగూడెం మండలంలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచి, ఆకాశం మేఘావృతమైంది. దీంతో రైతులు తమ పండించిన ధాన్యం, మొక్కజొన్నలను కాపాడుకోవడానికి కల్లాల వద్దకు చేరుకొని బరకాలు కప్పే పనుల్లో నిమగ్నమయ్యారు.