ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.