ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ లైన్లు మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై కామవరపుకోట మండలం జీలకర్రగూడెంకు చెందిన నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం క్రెయిన్ సహాయంతో మృతదేహాన్ని కిందకి దింపారు.