జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో భీమవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ బస్సు కోసం వారు ఎదురుచూడాల్సి వచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.