జంగారెడ్డిగూడెం: పది ఫలితాల్లో కవలల ప్రతిభ

శ్రీనివాసపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కవలలు మహాదేవ రమ్యశ్రీ, లాస్యశ్రీ పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రమ్యశ్రీ 568 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలవగా, లాస్యశ్రీ 534 మార్కులు సాధించారు. ఈ పాఠశాల నుంచి మొత్తం 11 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. కవలల ప్రతిభపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

సంబంధిత పోస్ట్