ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పటెన్న పాలెం గ్రామంలో మంగళవారం దొంగతనం జరిగింది. గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలోని బంగారాన్ని వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.