లింగపాలెం మండలంలోని కలరాయనగూడెం గ్రామంలో రామస్వామి (45) అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామస్వామి చావుకి అదే గ్రామానికి చెందిన కొందరు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. లింగపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.