లింగపాలెం: కారు ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ధర్మాజీగూడెంలో టైర్ల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఎస్. కె అహ్మద్(36) బైక్‌పై వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీకొంది. తీవ్ర గాయాలైన అహ్మద్‌ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్