చింతలపూడిలో లూయీ బ్రెయిలీ జన్మదిన వేడుకలు

చింతలపూడి మండలం సుబ్బరాజు జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సతీమణి విజయ రోషన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేశారు. దివ్యాంగ పిల్లల కోసం తీసుకొచ్చిన బహుమతులను అందజేశారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి విజయకేతనం స్టడీ మెటీరియల్ ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్