లింగపాలెం మండలం, కొత్తపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం స్థానికులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రహదారులను అభివృద్ధి చేయాలని, కమ్యూనిటీ హల్ నిర్మించాలని ఎంపీని కోరగా.. వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.