పేకాట, కోడిపందాలపై పోలీసుల ఉక్కుపాదం..32 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలంలోని శివపురం, కొమ్ముగూడెం గ్రామాలలో పేకాట, కోడిపందాల శిబిరాలపై చింతలపూడి పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో 32 మంది జూదగాళ్లను, 20 మోటార్ సైకిళ్లను, 14 పందెం కోళ్లను, రూ. 30,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూద క్రీడలు నిర్వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్