ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కూటమి నాయకులు మాధవరావు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ మనోజ్ఞ, CHO రహేల్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదని, పోలియో రహిత సమాజం మన బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.