వేగవరంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ టాయిలెట్ యూనిట్లను శుభ్రపరిచి పరిశుభ్రత పనులు చేపట్టారు. గ్రామ సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, DPRC (FTC) నాగేశ్వరరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి, స్వచ్ఛ వార్డు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రాలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వారి సమిష్టి సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕