ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా CTUలను క్లియర్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. అలాగే గ్రామ సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, DPRC (FTC) నాగేశ్వరరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి, స్వచ్ఛ వార్డు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రాలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.