దుప్పటి అడిగిందని హాస్టల్ నుంచి విద్యార్థిని పంపేసిన వార్డెన్

ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దుప్పటి అడిగినందుకు 8వ తరగతి విద్యార్థిని అక్షయను రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రులు అప్పటికప్పుడు వచ్చి విద్యార్థినిని తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులు విచారణ చేసి వార్డెన్‌పై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్