ఏలూరు జాతీయ రహదారిపై మరో ప్రమాదం

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు సమీపంలోని రామచంద్ర కాలేజీ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. బస్సు కాకినాడ నుంచి గుంటూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్