కరెంట్ షాక్‌తో దెందులూరులో బాలుడు మృతి

దెందులూరు మండలం సీతంపేటలో శనివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చందు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని దెందులూరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్