కొవ్వలి బాలుర వసతి గృహాన్ని తనిఖీ

దెందలూరు మండలం కొవ్వలిలోని సాంఘీక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహం వద్ద డ్రైనేజి సమస్య, మురుగునీరు పారుదల తదితర విషయాలపై చర్యలకోసం గత నెల 26వ తేదీన అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రారంభమైన పనులను పరిశీలించి డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించి మురుగునీరు పారుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్