దెందులూరు: తండ్రిని హతమార్చిన కొడుకు

దెందులూరు మండలం ఉండ్రాజవరంలో అంబళ్ళ సింహాచలంపై (72)అతని పెద్ద కుమారుడు రోకలి బండతో దాడి చేయడంతో మృతి చెందాడు. సింహాచలానికి ఇద్దరు కుమారులు. మద్యానికి బానిసైన పెద్ద కుమారుడు సన్యాసిరావు తరచూ తండ్రితో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద తండ్రితో గొడవ పడి రోకలిబండతో దాడి చేయడంతో సింహాచలం అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్