ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్లలో సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన ఈ సందర్భంగా, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కలెక్టర్ వివరించారు. ఆధునిక సాంకేతికతతో పాటు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగించాలని రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు.