దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36) మంగళవారం రాత్రి గుండుగొలను సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహం ఛిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. దెందులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.