ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రతిరోజూ దర్బార్

ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సోమవారం పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికలు, పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్