పెదపాడు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు ఎస్సై కట్టా శారద సతీశ్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు తాళ్లమూడికి చెందిన ఓ యువతికి ఏలూరు సమీప తంగెళ్లమూడికి చెందిన యువకుడితో ఏడాది కిందట వివాహమైంది. కొన్నాళ్లు భర్తతో కాపురం చేసిన ఆమె ఆపై పుట్టింటికి వచ్చేశారు. ఈ నెల 11న మధ్యాహ్నం బయటకెళ్లిన వివాహిత తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్