పెదవేగి: భార్య పుట్టింటికెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన పల్లెపాముల శ్రీను (34) కూలి పనులు చేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. శ్రీను మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన శ్రీను మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్