ఏలూరు ఏసీబీ కానిస్టేబుల్ కిశోర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమం హాస్పిటల్‌లో ఎమర్జెన్సీగా హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సిన పేషెంట్ సత్యనారాయణకు అవసరమైన రక్తాన్ని కిశోర్ 26వ సారి దానం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఆయన ఈ సహాయం చేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని వైద్యులు సూచించారు.