ఏలూరు: చిన వెంకన్నకు 'గ్యాస్' సెగ

యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంపై ప్రభావం చూపింది. స్వామివారి అన్న ప్రసాదాలు, ఇతర ప్రసాదాల తయారీకి రోజుకు 30 నుంచి 40 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడటంతో, ఆలయ అధికారులు గ్యాస్‌కు బదులుగా కట్టెలను ఉపయోగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.

సంబంధిత పోస్ట్