గురువారం వీరవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి సుమారు 30-35 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు వివరాలు లభించలేదు. అతను 5.5 అడుగుల ఎత్తు ఉండి, బ్లూ టీ షర్ట్, బ్లూ ట్రాక్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9704798990 నంబర్‌కు సంప్రదించాలని హెచ్‌సీ శ్రీనివాస్ కోరారు.