తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం ఏలూరులో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించారు. ఆ షాపు సేల్స్ మాన్‌తో సరదాగా మాట్లాడారు. వస్తువులను బేరం చేశారు. ఈ కార్యక్రమంలో సినీనటి సంయుక్త మీనన్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు ఉన్నారు.