ఏలూరు జిల్లా కైకలూరు వైవిఎన్ఆర్ ప్రభుత్వ కాలేజీలో అక్టోబర్ 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఫీసర్ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ జాబ్‌మేళాకు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీప్లమో, బీటెక్, డీగ్రీ, పీజీ విద్యార్హతలు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల వారు అర్హులన్నారు. అన్ని సర్టిఫికెట్ల జిరాక్సులతో మేళాకు హాజరు కావాలన్నారు.