సంక్రాంతి వేళ కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు, ఎడ్ల పోటీలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ పందుల పోటీలు ఎక్కడైనా చూశారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. గిరిజన సంప్రదాయం ప్రకారం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.