మండవల్లిలో జాతీయ రహదారిపై తిరగబడిన లారీ

మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహాదారిపై ధాన్యం లారీ ఆదివారం తిరగబడింది. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ ఆదివారం రాత్రి 6. 30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్