కైకలూరులో అంగన్‌వాడీల ఆందోళన

విజయవాడలో అంగన్‌వాడీల అరెస్టును నిరసిస్తూ కైకలూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై నేతలు చెల్లెమ్మ, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టయిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్