కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, శనివారం వరహాపట్నంలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను 10 మంది లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం రూ.7,45,404 ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సాయం బాధితుల కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.