మండలంలోని అయ్య వారి రుద్రవరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుడు చిరిగిరి పిచ్చోడు మాస్టారుకి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు. గురువారం ఏలూరు జడ్పీ హాలులో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చోడు మాస్టరును కలెక్టర్, ఎస్పీ కేపి శివ కిషోర్, జిల్లా అధికారులు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.