కైకలూరు ఆటో యూనియన్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ను కలిసింది

కైకలూరు బస్ స్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్‌ను మంగళవారం వరహాపట్నంలోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్