కైకలూరు మండలం రామవరంలో చేపల చెరువు వద్ద పిట్టలను తరమడానికి వాడే తుపాకీ మందు గుండు సామాగ్రి పేలి ముగ్గురికి గాయాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడు, నెల్లూరు నుంచి చేపల చెరువుల వద్ద పిట్టలను తరమడానికి వచ్చిన చరణ్, సతీశ్, మణి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంవత్సరం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.