కైకలూరు: ముదినేపల్లి ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణ శనివారం ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 'చేయి చేయి కలుపుదాం- అమరావతిని నిర్మిద్దాం' అని పిలుపునిచ్చారు. చిన్నతనంలోనే రాష్ట్రానికి, దేశానికి సాయం అందించడంతో పాటు అందరినీ భాగస్వాములను చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.