కైకలూరు: డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోండి

ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. డీజిల్ కొరతపై అవాస్తవాలు వ్యాప్తి చెంది ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం సేకరణ లారీలకు, ఆక్వా చెరువులకు అవసరాలకు సరిపడా డీజిల్ అందించాలని కోరారు. డీజిల్ కొరతపై అత్యవసరంగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం రాత్రి మంత్రి పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్